గజేంద్రుడి గీతాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ నిర్మాణ సంస్థ సూపర్‌గుడ్ ఫిలింస్ పతాకంపై తమిళ హీరో ఆర్య, కేథరిన్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘గజేంద్రుడు’. రాఘవ దర్శకత్వంలో ఆర్.బి.చౌదరి నిర్మించిన ఈ చిత్రానికి యువన్ శంకర్‌రాజా సంగీతం అందించారు. ఈ చిత్రంలోని పాటలు హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. ఈ కార్యక్రమంలో ఆర్.బి.చౌదరి, వంశీ పైడిపల్లి, రానా, ఎస్వీ కృష్ణారెడ్డి, సి.కళ్యాణ్, గుణశేఖర్, ఆర్య, కేథరిన్ తదితరులు పాల్గొన్నారు. సీడీని హీరో రానా విడుదల చేశారు. అనంతరం ఆర్.బి.చౌదరి మాట్లాడుతూ.. మా బ్యానర్‌లో వస్తున్న 89వ చిత్రమిది. ఆర్య కెరీర్‌లో టర్నింగ్ పాయింట్ అవుతుంది. కేథరిన్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. రానా మాట్లాడుతూ.. సూపర్‌గుడ్ బ్యానర్ అంటేనే మా సొంత బ్యానర్ లాంటిది. బాబాయి ఎన్నో సినిమాలు చేసి, మంచి విజయాలు అందుకున్నాడు. ఇక ఆర్య కూడా తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమే. తను నటించిన ఈ సినిమా మంచి విజయం సాధించి తెలుగులో ఆర్యకు హీరోగా మంచి మైలేజ్ దక్కాలి అన్నారు.