ఐటెం గర్ల్‌గా సోనియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అప్పట్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీడేస్ ఎంత సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో నలుగురు హీరోలు, నలుగురు హీరోయిన్స్ పరిచయం అయ్యారు. ఇక ఈ సినిమాతో పరిచయం అయిన శ్రాప్స్ గుర్తుందిగా.. అదే సోనియా!! ఆ తరువాత హీరోయిన్‌గా పలు చిత్రాల్లో నటించిన ఈ అమ్మడికి పెద్దగా కమర్షియల్ విజయాలు దక్కలేదు. దాంతో హీరోయిన్ ఫ్రెండ్‌గా దూకుడు సినిమాలోనూ నటించింది. హీరోయిన్‌గా కెరీర్ బాగాలేదు కాబట్టి.. ఈ అమ్మడు ఓ డేరింగ్ నిర్ణయం తీసుకుందట! అదేమిటో తెలుసా.. ఈ అమ్మడు ఇకపై ఐటెంగర్ల్‌గా చేయడానికి రెడీ అయిందట..! రింగు రింగుల జుట్టుతో ఆకట్టుకున్న సోనియాకు ఇప్పుడు ఓ క్రేజీ సినిమాలో ఐటెం సాంగ్ చేసే ఛాన్స్ వచ్చిందని, ఆ సాంగ్ చేయడానికి ఆమె ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. మరి ఐటెంగర్ల్‌గా ఈ అమ్మడు ఎలాంటి క్రేజ్ తెచ్చుకుంటుందో చూడాలి!