లక్కీ శ్రీయ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్లామర్ హీరోయిన్‌గా తన అందాలతో దాదాపు దశాబ్దంపాటు దక్షిణాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న శ్రీయ కొంత గ్యాప్ తర్వాత మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. ఆ మధ్య వరుస పరాజయాలతో సతమతమైన ఈ అమ్మడు కావాలనే గ్యాప్ తీసుకుని మళ్లీ సీరియస్‌గా సినిమాల్లో ప్రయత్నాలు చేసింది. హిందీలో ‘దృశ్యం’ సినిమాతో ఊపందుకున్న ఈమె సెకండ్ ఇన్నింగ్స్ తెలుగులో కూడా కంటిన్యూ అవుతోంది. లేటెస్ట్‌గా నందమూరి బాలకృష్ణ సరసన గౌతమీపుత్ర శాతకర్ణిలో నటించిన శ్రీయ మరోసారి బాలయ్య సరసన నటించేందుకు రంగం సిద్ధమైంది. బాలకృష్ణ నటిస్తున్న 101వ చిత్రం రెండో షెడ్యూల్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా శ్రీయను ఓకే చేశారు. నిజానికి ఈ పాత్రకోసం మొదట్లో అమలాపాల్, శ్రీయల పేర్లు వినిపించాయి. చివరగా శ్రీయను ఖరారు చేయడం విశేషం. ఇందులో మరో హీరోయిన్‌గా బాలీవుడ్ భామ ముస్కాన్‌ను ఎంపిక చేశారు.