21న బ్లాక్‌మనీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోహన్‌లాల్ కథానాయకుడిగా మాజిన్ మూవీ మేకర్స్ పతాకంపై సయ్యద్ నిజాముద్దీన్ రూపొందించిన చిత్రం ‘బ్లాక్‌మనీ’ (అన్నీ కొత్తనోట్లే). ఈ చిత్రానికి సంబంధించి సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేశారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- క్లాస్ మాస్ తేడా లేకుండా అందరికీ నచ్చే కథనంతో భాషతో సంబంధం లేకుండా హిట్లు అందిస్తున్న మోహన్‌లాల్, ఈ చిత్రంలో మరో మంచి పాత్రలో నటించారని, సెన్సార్‌వారు క్లీన్ యు సర్ట్ఫికెట్ అందించడంతో తమకు సినిమా విజయంపై నమ్మకం కుదిరిందని తెలిపారు. కథానాయకుడు లాల్‌గా మోహన్‌లాల్ టీవీ చానెల్ కెమెరామెన్‌గా నటించారని, అమలాపాల్ సీనియర్ ఎడిటర్ రేణుకగా వైవిధ్యంగా నటించిందని తెలిపారు. సంబంధ బాంధవ్యాలు, వృత్తిపరమైన సంఘర్షణల చుట్టూ అల్లుకున్న కథ, కథనంతో ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని, మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన ఈ సినిమా తెలుగులో కూడా అంతే విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉందని ఆయన తెలిపారు. తెలుగు రాష్ట్రాలతో సహా ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు వస్తున్నామని ఆయన తెలిపారు.