కొత్తగా చేయాలనే ప్రయత్నమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కెరీర్ మొదటినుంచీ భిన్నమైన సినిమాలతో ప్రయాణం మొదలుపెట్టాడు వరుణ్‌తేజ్. ‘కంచె’ సినిమాతో జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న అతను తాజాగా నటించిన చిత్రం ‘మిస్టర్’. శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి, హెబ్బాపటేల్ కథానాయికలుగా నటించారు. ఈ నెల 14న ఈ సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా మిస్టర్ విశేషాలను వరుణ్‌తేజ్ తెలిపాడు.
ఎలా వుంటాడు?
ఈ మిస్టర్ అందరికీ ప్రేమను పంచుతుంటాడు. లవ్ ఫీలింగ్, వెరీ గివింగ్ పర్సన్, ప్రేమ పంచడమే కాదు ఎవరికే సహాయం కావాలన్నా ముందుంటాడు. అలాంటి వాడికి సమస్యలు వస్తే ఆ ప్రేమను వెతుక్కోవడానికి ఏం చేశాడన్నదే కథ.
ట్రయాంగిల్ లవ్‌స్టోరీ
అవును.. ట్రయింగిల్ లవ్‌స్టోరీ అయినా నాతోపాటు హీరోయిన్లు లావణ్య త్రిపాఠి, హెబ్బాపటేల్‌కి ఓ బ్యాక్ స్టోరీ ఉంటుంది. అది కూడా ముగ్గురి మధ్య జరిగే కథ మెయిన్‌గా వుంటుంది. ఇంతకుముందు నే చేసిన మూడు చిత్రాల్లో నా పాత్ర వైవిధ్యంగా వుంటే ఈ సినిమాలో లవ్‌లీగా వుంటుంది. సెటిల్డ్‌గా కాకుండా మూమెంట్‌తో పాత్ర వుండేలా దర్శకుడు కేర్ తీసుకున్నాడు.
శ్రీనువైట్లతో
ఆయనతో పనిచేయడం మెమరబుల్ మూవ్‌మెంట్. మెచ్యూర్డ్ లవ్‌స్టోరీలను బాగా చేస్తారని పేరుంది. కమర్షియల్‌గా సినిమాలు చేస్తున్నపుడు అవి సక్సెస్ కావడంతో అందరూ ఆయన్ని అలాంటి సినిమాలే చేయమన్నారు. ప్రతి ఒక్కరి జర్నీలో సక్సెస్, ఫెయిల్యూర్స్ కామన్‌గా వుంటాయి. ఓ మంచి ఫ్రెష్ లవ్‌స్టోరీ చేయాలనుకుని ‘మిస్టర్’ చేశారు. ఆయనకున్న ఎక్స్‌పీరియెన్స్ ఎక్కువ. ఆయనతో చేయడం నాకు మంచి లెర్నింగ్ ఎక్స్‌పీరియెన్స్. చాలా విషయాలు నేర్చుకున్నా.
జర్నీ నేపథ్యం
అవును. అందుకే చాలా ప్రాంతాల్లో షూటింగ్ చేశాం. సినిమా మొదలైనప్పటినుండీ ఎక్కువ ట్రావెల్ చేశాం. హైదరాబాద్‌కు దూరంగా వుండే లొకేషన్లు చిక్‌మంగళూరు, కేరళ, స్పెయిన్ లాంటి ప్రాంతాల్లో షూటింగ్ చేశాం. ఇటలీ, స్విట్జర్లాండ్‌ల్లో పాటలు చేశాం.
కొత్త దర్శకులతో
ఈ సినిమా షూటింగ్‌లో గాయపడ్డ నేను కొత్త దర్శకుల కథలు విన్నాను. శేఖర్ కమ్ముల ‘్ఫదా’ తరువాత వెంకీ అట్లూరి అనే కొత్త దర్శకుడితో సినిమా చేస్తాను.
కథల ఎంపిక
నాన్నా, నేను ఖాళీగా వున్నప్పుడు కూర్చుని మాట్లాడుతాం. నాపై ఆయనకు నమ్మకం ఉంది. కథల ఎంపికలో ఆయన ఎప్పుడూ జోక్యం చేసుకోరు. నీ జర్నీ నువ్వే చెయ్యాలంటారు.
భిన్నమైన కథలు
ప్రేమకథల్లో అబ్బాయి అమ్మాయి వెనుకనో, అమ్మాయి అబ్బాయి వెనుకనో పడతారు. ప్రేమించుకుంటారు. అలా కాకుండా హీరో హీరోయిన్ మాట్లాడుకోకుండా వుంటే ఎలా వుంటుందనే కథ నచ్చడంతో ముకుంద చేశా. కంచెలో కథనం బ్యాక్‌డ్రాప్ బాగా వచ్చాయి. లోఫర్‌లో మదర్ సెంటిమెంట్ నచ్చింది. మిస్టర్‌లో నా ఏజ్‌కు తగ్గట్టుగా ఎంటర్‌టైన్‌మెంట్‌తో కూడిన లవ్‌స్టోరీ చేద్దామనుకున్నా. దర్శకుడు చెప్పడంతో కనెక్ట్ అయ్యా.
ఫిదా గురించి?
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘్ఫదా’ చేస్తున్నా. 25 రోజుల చిత్రీకరణ జరపాలి. సినిమా ఇప్పటికే 75 శాతం పూర్తయింది. మంచి రిలీజ్ డేట్ అనుకుని విడుదల చేస్తాం. క్లాసీ లవ్‌స్టోరీగా ఈ చిత్రం తెరకెక్కుతోంది.
మళ్లీ క్రిష్‌తో సినిమా
క్రిష్‌తో ‘రాయబారి’ చేయాల్సింది గాని కుదరలేదు. ఆయనతో మాట్లాడుతూనే ఉన్నా. ఆయన ఇప్పుడు బాలీవుడ్‌లో గౌతమీపుత్ర శాతకర్ణి కార్యక్రమాల్లో వున్నారు. రెండు మూడు కమిట్‌మెంట్స్ నాకూ ఉన్నాయి. రాయబారి మంచి స్క్రిప్ట్. భవిష్యత్తులో తప్పకుండా చేస్తాం.

-శ్రీ