చరణ్ సినిమాలో అనసూయ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్ ప్రస్తుతం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న విషయం తెలిసిందే. అచ్చమైన పల్లెటూరి నేపథ్యంలో రూపొందే ప్రేమకథతో ఈ సినిమా ఉంటుందట. ఇక ఈ చిత్రంలో ఓ కీలకమైన పాత్రలో గ్లామర్ యాంకర్ అనసూయ నటిస్తుందట! సోగ్గాడే చిన్నినాయన, క్షణం, విన్నర్ లాంటి సినిమాల్లో నటించిన ఈ అమ్మడు ఈ సినిమాలో ప్రాముఖ్యత ఉన్న పాత్రలో కనిపిస్తుందని తెలిసింది. సమంత హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో మరి అనసూయ ఐటెం సాంగ్ కూడా చేస్తుందేమో చూడాలి. మొత్తానికి సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ క్రేజ్ తెచ్చుకున్న ఈ గ్లామర్ భామ అటు టెలివిజన్ రంగంలోనూ దుమ్ము రేపుతోంది. అనసూయ గ్లామర్ ధాటికి మిగతా యాంకర్స్ పరారవుతున్నారట! మైత్రి మూవీస్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దసరాకు విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.