యధార్థకథతో డేగల శీను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాశ్మీర్‌కు చెందిన జహీదా శ్యామ్ కథానాయికగా ఆర్.ఎఫ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై అమర్‌నాధ్ మండూరి దర్శక నిర్మాణంలో రూపొందుతోన్న చిత్రం ‘డేగల శీను’. ఈ చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో బుధవారం ఉదయం జరిగింది. కథానాయికపై దర్శకుడు సాగర్ క్లాప్‌నివ్వగా, నటుడు బాబుమోహన్ కెమెరా స్విచ్చాన్ చేశారు. తొలి సన్నివేశానికి వి.సముద్ర గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శక నిర్మాత అమర్‌నాధ్ మండూరి మాట్లాడుతూ- గుంటూరులో జరిగిన ఓ యధార్థ సంఘటన ఆధారం చేసుకొని దానికి కొన్ని కల్పితాలు జోడించి ఈ కథను రాసుకున్నామని, సినిమాలో అందరూ హీరోలుగా కనిపిస్తూనే విలన్లుగా కూడా నటిస్తారని, యూత్ ఈగో సమస్యలతో యాభై హత్యలకు ఎలా దారితీసిందనేదే ఈ సినిమా కథనమని తెలిపారు. చిత్రంలో పెద్ద నటీనటులందరూ నటిస్తారని, కాశ్మీర్‌కు చెందిన జహీదా శ్యామ్‌ను హీరోయిన్‌గా పరిచయం చేస్తున్నామని, గుంటూరు, విజయవాడ పరిసర ప్రాంతాల్లో రెగ్యులర్ షూటింగ్ జరుపుతామని తెలిపారు. 80 రోజులపాటు రెండు షెడ్యూల్స్‌లో సినిమా పూర్తిచేస్తామని, సమాజంలో పోలీసు వ్యవస్థ ఆవశ్యకతను ఈ చిత్రంలో ప్రత్యేకంగా చర్చిస్తున్నామని ఆయన అన్నారు. తెలుగులో మంచి చిత్రంతో పరిచయం కావడం ఆనందదాయకమని నటి జహీదా శ్యామ్ తెలిపారు. సుమన్, భానుచందర్, బాబుమోహన్, సీనియర్ బాలయ్య, జయప్రకాష్‌రెడ్డి, బాహుబలి ప్రభాకర్, వినోద్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: అడుసుమల్లి విజయకుమార్, ఎడిటింగ్: నందమూరి హరి, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, నిర్మాత, దర్శకత్వం: అమర్‌నాధ్ మండూరి.