బ్లాక్‌మనీ ట్రైలర్ విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోహన్‌లాల్ నటించిన మలయాళ చిత్రం ‘రన్ బేబి రన్’. ఈ చిత్రాన్ని బ్లాక్‌మనీ (అన్నీ కొత్తనోట్లే) పేరుతో మాజిన్ మూవీ మేకర్స్ పతాకంపై సయ్యద్ నిజాముద్దీన్ తెలుగులో అందిస్తున్నారు. సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయి క్లీన్ యు సర్ట్ఫికెట్ లభించింది. ఈ నెల 21న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. హాస్యనటుడు అలీ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను బుధవారం ఉదయం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ- మోహన్‌లాల్ లాంటి అగ్ర నటుడు నటించిన ఈ చిత్రం తెలుగులో పెద్ద విజయం సాధించాలని, వరుస విజయాలతో దూసుకెళుతున్న ఆయనకు ఈ చిత్రం మరో సక్సెస్ ఇస్తుందనీ అన్నారు. మీడియా నేపథ్యంలో తెరకెక్కిన బ్లాక్‌మనీ చిత్రం పెద్ద విజయం సాధిస్తుందన్న నమ్మకం వుందని, అమలాపాల్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో సంబంధ బాంధవ్యాలు, వృత్తిపరమైన సంఘర్షణల చుట్టూ సినిమా కథాంశం సాగుతుందని, మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిందని నిర్మాత సయ్యద్ నిజాముద్దీన్ తెలిపారు.