ఆ విషయంలో మాత్రం.. నో కాంప్రమైజ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొందరు భామలు రెమ్యూనరేషన్ విషయంలో కచ్చితంగా ఉంటారు? వాళ్ళు ముందు చెప్పినవన్నీ తు.చ తప్పకుండా జరగాల్సిందే.. లేదంటే రచ్చరచ్చ చేస్తారు. ఈ విషయంలో గ్లామర్ భామ సోనాక్షి చాలా ముదురు? బాలీవుడ్‌లో ఓ రేంజ్‌లో ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ అమ్మడికి ఈ మధ్య క్రేజ్ తగ్గింది. చేసిన సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్ అవ్వడంతో ప్రస్తుతం సినిమాలు తగ్గాయి. అయితే సినిమాల్లో నటించేందుకు వచ్చే పారితోషికం విషయంలో నిర్మాతల వ్యవహార శైలి గురించి సోనాక్షి ఓపెన్‌గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. హీరోలకు ఇస్తున్నట్టే హీరోయిన్లకు ఎందుకు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. తాము కూడా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ నిర్మాతలకు లాభాలు తెచ్చిపెడుతున్నామని చెప్పింది. కానీ నిర్మాతలు మాత్రం హీరోయిన్స్ రెమ్యూనరేషన్ విషయంలో చాలా దారుణంగా ప్రవర్తిస్తుంటారని, అయితే తాను ఎవరినీ ఉద్దేశించి మాట్లాడడం లేదని చెప్పడం విశేషం. అయితే రెమ్యూనరేషన్ విషయంలో ఈ అమ్మడు మాత్రం కచ్చితంగా ఉంటుందట!