డేటింగ్ చేశా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుమారి 21 ఎఫ్‌తో క్రేజ్ తెచ్చుకున్న హెబ్బాపటేల్.. ఆ సినిమా తరువాత బోల్డ్‌గా మాట్లాడేందుకు ఎక్కడా వెనుకాడదు. లేటెస్టుగా ఓ ఇంటర్వ్యూలో మరింత బోల్డ్‌గా మాట్లాడి షాక్ ఇచ్చింది. తాను ఒక వ్యక్తితో డేటింగ్ చేశానని క్లియర్‌గా చెప్పడం విశేషం. అయితే అతను పరిశ్రమ వ్యక్తి కాదని, అతడివల్లే తాను ఎదిగానని చెప్పడం. అతనితో ఉన్న బంధం గురించి తన ఫ్యామిలీలో కూడా తెలుసనీ, కానీ మా ఇద్దరి మధ్య ఉన్న బంధం ఎక్కువ రోజులు నిలవలేదని, ఆ తరువాత సినిమాల్లోకి వచ్చాక నాకు, రాజ్‌తరుణ్‌కు మధ్య ఎఫైర్ ఉందంటూ కూడా ప్రచారం జరిగిందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం పెళ్లి గురించిన ఆలోచన లేదని, ముందు డబ్బు సంపాదించాక హైదరాబాద్‌లో ఇల్లు కొనాలని ఉందని చెప్పింది. ఈ అమ్మడు వరుణ్ తేజ్‌తో నటించిన ‘మిస్టర్’ ఈ నెల 14న విడుదల కానుంది.