ప్రకాష్‌రాజ్ వాయిస్‌తో మామ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీదేవి ప్రధాన పాత్రలో మ్యాడ్ ఫిలింస్, థర్డ్ ఐ పిక్చర్స్ పతాకాలపై రవి ఉద్యవార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘మామ్’. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాను జూలై 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. చిత్రానికి సంబంధించిన తెలుగు మోషన్ పోస్టర్‌ను ప్రకాష్‌రాజ్ వాయిస్‌తో గురువారం విడుదల చేశారు. ఇంగ్లీష్ వింగ్లీష్ తరువాత శ్రీదేవి నటిస్తున్న ఈ చిత్రంలో అక్షయ్‌ఖాన్నా, అభిమన్యుసింగ్, సజల్‌అలీ ప్రధాన తారాగణంగా నటించగా, సంగీతం ఎ.ఆర్.రెహమాన్, కెమెరా అనై గోస్వామి అందిస్తున్నారు. నిర్మాతలుగా బోనీకపూర్, సునీల్ మన్‌చందా, నరేష్ అగర్వాల్, ముకేష్ తల్‌రేజా, గౌతమ్ జైన్ వ్యవహరిస్తున్నారు.