ఎన్టీఆర్ సరసన...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గత కొన్ని రోజులుగా ఎన్టీఆర్ తాజా చిత్రం ‘జై లవకుశ’లో రెండో హీరోయిన్‌గా నటించబోయేది ఎవరు అనే విషయంపై తీవ్ర సందిగ్ధత నెలకొంది. చాలామంది హీరోయిన్ల పేర్లు కూడా వినిపించాయి. వీటన్నింటికి ఫుల్‌స్టాప్ పెడుతూ ఎన్టీఆర్ ఆర్ట్స్ యూనిట్ ఆ హీరోయిన్ ఎవరనేది ప్రకటించింది. ఆమె మరెవరో కాదు నివేదా థామస్. గత సంవత్సరం నాని నటించిన ‘జెంటిల్‌మాన్’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు, నానితో పోటాపోటీగా నటించి ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు పొందింది. అంతేగాక నాని సరసన ‘నిన్నుకోరి’ అనే చిత్రంలో నటించే అవకాశాన్ని కూడా దక్కించుకుంది. ‘జైలవకుశ’లో ఎన్టీఆర్ సరసన మొదటి హీరోయిన్‌గా రాశిఖన్నాను ఎంపిక చేయగా, రెండవ హీరోయిన్‌గా నివేదాను ఎంపిక చేశారు. ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ మూడు వైవిధ్యమైన గెటప్స్‌లో కనిపించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, సి.కె.మురళీధరన్ ఫొటోగ్రఫి అందిస్తున్న ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఆగస్టు నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

చిత్రం.. నివేదా థామస్