21న ఇద్దరిమధ్య 18

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎస్.ఆర్.పి. విజువల్ పతాకంపై రాంకార్తీక్, భాను త్రిపాఠి జంటగా బిత్తిరి సత్తి ప్రధాన పాత్రలో నాని ఆచార్య దర్శకత్వంలో శివరాజ్ పాటిల్ నిర్మించిన మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రం 3ఇద్దరిమధ్య 182. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకుని ఈనెల 21 ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయింది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత శివరాజ్ పాటిల్ మాట్లాడుతూ.. 3ఇద్దరిమధ్య 182 చిత్రం మంచి మేసేజ్ ఓరియెంటెడ్ మూవీ. చిత్రం అంతా అద్భుతంగా వచ్చింది. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. చిత్రం చూసిన సెన్సార్ సభ్యులు ఈ సినిమాపై ప్రత్యేక అభినందనలు తెలుపడంతోపాటు, తెలంగాణ మంత్రి హరీశ్‌రావు సినిమా చూసి మంచి మెసేజ్ ఇస్తున్నారని మమ్మల్ని అభినందించడం ఎంతగానో ఆనందాన్నిచ్చింది. దర్శకుడు నాని ఆచార్య సినిమాని తెరకెక్కించిన తీరు నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. ఏప్రిల్ 21న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం. ఈ చిత్రానికి ప్రేక్షకులు ఆదరించి, ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాం అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఘంటాడి కృష్ణ, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్, కెమెరా: జి.ఎల్.బాబు, కొరియోగ్రఫీ: నిక్సన్ డిక్రూజ్, భాను, గణేష్, ఫైట్స్: రియల్ సతీష్, పాటలు: కందికొండ, వరికుప్పల యాదగిరి, రామ్ పైడిశెట్టి, చిలుకరెక్క గణేష్, సమర్పణ: సాయితేజ పాటిల్, నిర్మాత: శివరాజ్‌పాటిల్, కథ, దర్శకత్వం: నాని ఆచార్య.