శంకర్ భారీ మల్టీస్టారర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెండి తెరపై వండర్స్‌ను క్రియేట్ చేస్తూ సంచలన దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు శంకర్ ప్రస్తుతం రజనీకాంత్‌తో ‘రోబో-2’ చిత్రాన్ని రూపొందించే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. డిసెంబర్ 12న లాంఛనంగా ప్రారంభమయ్యే ఈ సినిమా దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుందట! మరోవైపు ఈ సినిమా తర్వాత మరో భారీ మల్టీస్టారర్‌ను తెరకెక్కించేందుకు శంకర్ సన్నాహాలు మొదలుపెట్టారు. ఇప్పటికే ఈ కథపై కసరత్తులు కూడా జరిగాయని తెలిసింది. తమిళ క్రేజీ స్టార్స్ విక్రమ్, విజయ్‌ల కలయికలో ఈ సినిమా ఉంటుందని, ఇప్పటికే వీరిద్దరికీ కథ చెప్పి ఒప్పించాడట శంకర్. మొత్తానికి శంకర్ రూపొందించే మల్టీస్టారర్‌పై కోలీవుడ్‌లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ‘రోబో-2’ సినిమా తర్వాత ఈ చిత్రం సెట్స్‌పైకి రానుందట. దీనికి సంబంధించిన అధికారిక వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.