మళ్లీ మాస్‌లోకి..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్ కథానాయకుడు రవితేజ తాజాగా నటిస్తున్న 3రాజాది గ్రేట్2 చిత్రం షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. 3పటాస్ ఫేం2 అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. 3బెంగాల్ టైగర్2 తరువాత ఏడాది గ్యాప్ తీసుకున్న రవితేజ, మళ్లీ తన పాత స్టయిల్‌లోకి వచ్చేందుకు కసరత్తులు చేశాడు. 3కిక్-2, 3బెంగాల్ టైగర్2 చిత్రాల్లో స్లిమ్‌గా మారి చేసిన ప్రయ త్నం బెడిసికొట్టింది. ఆ సినిమాలతో రవితేజ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాడు. దాంతో ఆ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయాల్ని చవిచూశాయి. మాస్ మహారాజాగా క్రేజ్ తెచ్చుకున్న రవితేజ పాత స్టయిల్‌లోనే వుంటే బావుంటుందని అభిమానులనుంచి స్పందన రావడంతో ఆయన మళ్లీ అదే స్టయిల్‌లోకి రావడానికి చేసిన ప్రయత్నం ఫలించింది.
ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్న మెహరీన్‌తో రవితేజ దిగిన సెల్ఫీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రవితేజను చూస్తుంటే మళ్లీ 20 ఏళ్లు వెనక్కి వెళ్లినట్లు కొత్త ఉత్సాహంతో ఉన్నాడు. 3రాజా ది గ్రేట్2 టైటిల్ తరహాలోనే రవితేజలో కనిపిస్తున్న మార్పుతో ఫ్యాన్స్ ఖుషీమీద ఉన్నారట.