ఆ ఒక్కటీ కష్టమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెళ్లయిన తరువాత సినిమాలకు ఫుల్‌స్టాప్ పెట్టడం ఒక స్టయిల్. లేదూ అంటూనే తగ్గించుకోవడం ఇంకొందరి స్టయిల్. పెళ్లయ్యాక ఎలాగూ అవకాశాలు సన్నగిల్లుతాయి కనుక, క్రమంగా దూరమవుతుంటారు ఇంకొందరు. కానీ హాట్ హీరోయిన్ నర్గిస్ ఫక్రి మాత్రం తన స్టయిల్‌కు ఓ కండిషన్ పెట్టుకుంది. ఇక ఏడాదికి ఒక్క సినిమానే చేయాలని తనకు తానుగా పెట్టుకున్న నియమాన్ని ప్రకటించేసింది. అందుకో కారణం కూడా చెబుతోంది ఫక్రి. సినిమా మాత్రమే జీవితం కాదు. ఇంకా చాలా చేయాలి. అందుకోసమే ఏడాదికొక్కటే కండిషన్ అంటోంది నర్గిస్. ఆ ‘చాలా’ లిస్ట్ చెబితే మాత్రం ఆశ్చర్యపోక తప్పదు. ‘నాకు వంటలు చేయడం ఇష్టం. మొక్కలు పెంచడం మరీ ఇష్టం. ట్రావెలింగ్ ఇంకా ఇంకా ఇష్టం. వీటన్నింటికీ టైం పెట్టాలని, వీటి ప్రాధాన్యతలు నెరవేర్చుకోవాలన్నా సినిమాలు తగ్గించుకోవాలిగా’ అంటోంది గడుసుగా. అందుకే ఏడాదికి ఒక్క సినిమాలోనే నటించనుందట. దీంతో ఆమెపై బాలీవుడ్‌లో సెటైర్లు పడుతున్నాయి. అవకాశాలు కరవైతే ఇలాంటి స్టేట్‌మెంట్లే బయటపడతాయి అంటూ సినీ జనాలు సెటైర్లు వేస్తున్నారు. అడిగితేనే సినిమాలు దొరకడం కష్టమవుతున్న హీరోయిన్లకు, ఇలాంటి స్టేట్‌మెంట్లు ఇస్తే ఇంకేం దొరుకుతాయి. చేద్దామన్నా ఆ ఒక్కటీ కష్టమే అంటున్నారు ఆమె అంటే గిట్టనోళ్లు.