5న బాబు బాగా బిజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అడల్ట్ కంటెంట్‌తో అలరించేందుకు అవసరాల శ్రీనివాస్ సిద్ధమైపోయాడు. అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ నామా, అవసరాలను హీరోగా పెట్టి నిర్మించిన చిత్రమే ‘బాబు బాగా బిజీ’. బాలీవుడ్ హిట్ చిత్రం ‘హంటర్’కి తెలుగు రీమేక్ ఇది. నవీన్ మేడారం దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రంలో మిస్తీ చక్రవర్తి, తేజస్వి మదివాడ, సుప్రియ ఐసోల, శ్రీముఖి హీరోయిన్లుగా నటిస్తున్నారు. సెన్సారు నుంచి ‘ఎ’ సర్ట్ఫికెట్ పొందిన చిత్రాన్ని మే 5న అత్యధిక థియేటర్లలో విడుదల చేయనున్నట్టు నిర్మాత ప్రకటించారు. ఈ సందర్భంలో అభిషేక్ నామా మాట్లాడుతూ ‘బాబు బాగా బిజీ.. ఓ రొమాంటిక్ కామెడీ. శ్రీనివాస్ చేసిన అన్ని చిత్రాలకంటే ఇది వైవిధ్యంగా ఉంటుందనడంలో సందేహం లేదు. చిత్రాన్ని దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించాడు. సినిమా ప్రారంభం నుంచి చివరివరకు నవ్వించే చిత్రమిది. అన్నివర్గాల్ని తప్పకుండా ఎంటర్‌టైన్ చేస్తుంది. హీరోయిన్లంతా విభిన్నమైన పాత్రల్లో ప్రేక్షకుల్ని, ముఖ్యంగా యూత్‌ని ఎంటర్‌టైన్ చేస్తారు. మంచి పాటల్ని డిజైన్ చేశాం. సెన్సారు పూర్తిచేసుకుంది. మే 5న పెర్‌ఫెక్ట్ సమ్మర్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రాతుతోంది’ అన్నారు. తనికెళ్ల భరణి, పోసాని కృష్ణమురళి, అన్నపూర్ణమ్మ, ప్రియదర్శి, రవిప్రకాష్ తదితరులు నటిస్తున్న చిత్రానికి కెమెరా సురేష్ భార్గవ, సంగీతం సునీల్ కశ్యప్.