మహానటిని కాదు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగులో వస్తున్న ఆసక్తికరమైన బయోపిక్ -మహానటి. సావిత్రి జీవిత కథ ఆధారంగా నాగ్‌అశ్విన్ తెరకెక్కించబోతున్న చిత్రంపై సినీవర్గాల్లో ఆసక్తి కనిపిస్తోంది. కెరీర్‌ను టాప్‌గేర్‌లో పరిగెత్తిస్తున్న సమంత, టాప్‌రేంజ్‌కు చేరుకోవడానికి ఉత్సాహంతో అడుగులేస్తున్న కీర్తి సురేష్‌లు చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించనున్నారన్న సంగతి తెలిసిందే. అయితే, ఇద్దరిలో మహానటి సావిత్రిగా కనిపించేది ఎవరన్న అంశంపై అన్ని వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో తాజాగా వినిపిస్తోన్న కథనాల ప్రకారం సావిత్రి పాత్రకు సమంత దూరంగానే ఉందని అంటున్నారు. ‘మహానటి’లో సమంత జర్నలిస్ట్ పాత్ర చేయబోతోందన్న కథనాలు బలంగా వినిపిస్తున్నాయి. ఫ్రెష్ ఫేస్ కీర్తి సురేష్‌నే సావిత్రి పాత్రకు చిత్రబృందం ఎంపిక చేసుకుందన్న ఊహాగానాలూ మరింత పదునెక్కాయి. ఇప్పటికే జర్నలిస్ట్ పాత్ర కోసం సమంత కసరత్తు చేసిందని, ఆ పాత్రను స్క్రీన్‌పై ప్రజెంట్ చేయడంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతోందన్న చర్చలు మొదలయ్యాయి. వైజయంతీ మూవీస్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రంలో తన పాత్ర ఏమిటన్నది సమంతే స్పష్టం చేసేవరకూ, ఇలాంటి ఊహాగానాలు వినక తప్పదు.