వేసవికి రారండోయ్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగచైతన్య, రకుల్‌ప్రీత్‌సింగ్ జంటగా అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై కళ్యాణకృష్ణ కురసాల దర్శకత్వంలో అక్కినేని నాగార్జున రూపొందిస్తున్న లవ్, ఎమోషనల్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘రారండోయ్ వేడుక చూద్దాం’. జగపతిబాబు, సంపత్ ప్రధాన తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రం ఒక పాట మినహా షూటింగ్ పూర్తయింది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని మే మూడవ వారంలో వేసవి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో నాగార్జున అక్కినేని మాట్లాడుతూ- ఒక అమ్మాయి తనకొచ్చే భర్త రాకుమారుడిలా ఉండాలని కలలు కంటుందని, ఆ రాకుమారుడు ఎవరు? ఎలా వుంటాడు? ఆమె కల నెరవేరిందా అన్న కథనంతో ఈ చిత్రం రొమాంటిక్ చిత్రంగా రూపొందించామని తెలిపారు. దర్శకుడు మంచి కథ చెప్పడంతో గ్రాండ్‌గా రూపొందించామని, తండ్రిగా జగపతిబాబు, కొడుకుగా నాగచైతన్య మధ్య వచ్చే సన్నివేశాలు బాగుంటాయని, రకుల్ ప్రీత్‌సింగ్ తండ్రిగా సంపత్ పాత్ర కూడా హైలెట్‌గా వుంటుందని ఆయన తెలిపారు. కెమెరా విజువల్స్, సంగీతం సినిమాకు ప్లస్‌గా నిలుస్తాయని, తెలుగుదనం, నేటివిటీ గురించి దర్శకుడు పలు జాగ్రత్తలు తీసుకున్నారని ఆయన అన్నారు. ఒక్క పాట తప్ప సినిమా అంతా పూర్తయిందని, మే మూడవ వారంలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నామని ఆయన అన్నారు. వైవిధ్యమైన సినిమాగా ప్రేక్షకులకు నచ్చుతుందని జగపతిబాబు తెలిపారు. ఒక అమ్మాయి ఒక అబ్బాయిమధ్య వుండే ఫ్యామిలీ ఎమోషన్స్, రిలేషన్స్‌తో కథనం ప్రధానంగా, తండ్రీకొడుకులమధ్య వుంటే బంధం, తండ్రి కూతుళ్లమధ్య వుండే ప్రేమ ఎలా వుంటుందో ఈ సినిమాలో చూపామని, ఎమోషన్ సీన్లు అద్భుతంగా వచ్చాయని దర్శకుడు కళ్యాణకృష్ణ తెలిపారు. కార్యక్రమంలో నాగచైతన్య, రకుల్‌ప్రీత్‌సింగ్ తదితరులు పాల్గొని విశేషాలు తెలిపారు. వెనె్నల కిశోర్, కౌసల్య, ఇర్షాద్, పోసాని కృష్ణమురళి, తా.రమేష్, సప్తగిరి, రఘుబాబు, పృధ్వీరాజ్, చలపతిరావు, అన్నపూర్ణ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా:విశే్వశ్వరరావు, సంగీతం:దేవిశ్రీప్రసాద్, నిర్మాత:అక్కినేని నాగార్జున, దర్శకత్వం:కళ్యాణకృష్ణ కురసాల.