స్పీడ్ పెంచిన త్రిష!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సౌత్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన త్రిషకు ప్రేక్షకుల్లో ఇప్పటికీ బ్రహ్మాండమైన ఫాలోయింగ్ వుంది. ప్రస్తుతం గ్లామర్ రోల్స్‌కి బ్రేక్ ఇచ్చి పూర్తిగా కథాపరమైన, హీరోయిన్ సెంట్రిక్ సినిమాలనే చేస్తున్న ఆమె తాజాగా మోహిని, శతురంగ వెట్టై, గర్జానై వంటి మూడు సినిమాల్ని ఒకేసారి పూర్తిచేసేశారు. త్రిష గత మూడు, నాలుగు నెలలుగా ఏ మాత్రం గ్యాప్ లేకుండా ఈ సినిమాలపైనే పనిచేశారు. వీటిలో గర్జానై బాలీవుడ్ చిత్రం ఎన్‌హెచ్ 100కు రీమేక్. ఈ థ్రిల్లర్‌ను సుందర్ బాలు డైరెక్ట్ చేశారు. అలాగే నిర్మల్ కుమార్ డైరెక్ట్ చేసిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘శతురంగ వెట్టై’లో త్రిష అరవిందస్వామితో కలిసి నటించారు. ఇక మూడో సినిమా ‘మోహిని’ హర్రర్ జోనర్‌లో రూపొందింది. ఇలా మూడు విభిన్న తరహా సినిమాల్ని ఒకేసారి కంప్లీట్ చేసిన త్రిష తమిళంలో 1818, 96 మలయాళంలో ‘హే జూడ్’ వంటి మరో మూడు సినిమాల్లో నటిస్తోంది.