అదిగో అల్లదిగో... నాని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరుస సక్సెస్‌లతో దూసుకుపోతున్న యంగ్ హీరో నాని తన హిట్ దర్శకుడితో మరో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడని సమాచారం. ఆ దర్శకుడే హను రాఘవపూడి. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నాని నూతన దర్శకుడు శివ నిర్మాణ దర్శకత్వంలో ‘నిన్నుకోరి’ సినిమా చేస్తున్నాడు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం త్వరలోనే పూర్తయి జూలైకు రిలీజ్‌కు కానుంది. దీని తర్వాత నాని ప్రముఖ దర్శకుడు దిల్‌రాజు నిర్మాణంలో మరొక నూతన దర్శకుడు వేణు శ్రీరామ్‌తో కలిసి ఒక సినిమా చేస్తున్నాడు. ఈ ప్రాజెక్టు పూర్తయ్యేటప్పటికి నవంబర్ లేదా డిసెంబర్ అవుతుందట. మరోవైపు హను రాఘవపూడి కూడా నితిన్ హీరోగా ‘లై’ సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తరువాత నానితో తెరకెక్కించే ప్రాజెక్టు సెట్స్‌పైకి రానుంది. ఈ చిత్రానికి అదిగో అల్లదిగో అనే టైటిల్ పెడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.