పాటల్లో రక్షక భటుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో సుఖీభవ మూవీస్ బ్యానర్‌పై ఎ.గురురాజ్ నిర్మించిన చిత్రం ‘రక్షకభటుడు’. కంటెంట్‌ను హీరోగా పెట్టి దర్శకుడు వంశీకృష్ణ ఆకెళ్ళ చేసిన ఈ చిత్రం మే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. శేఖర్ చంద్ర సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం సోమవారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది. పాటను మారుతి విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత ఎ.గురురాజ్ మాట్లాడుతూ- వంశీకృష్ణ నాకు ఈ కథను వినిపించారు. బాగా నచ్చడంతో సినిమా నిర్మించడానికి సిద్ధమయ్యాను. ముఖ్యంగా వంశీ చెప్పిన క్లైమాక్స్ విని ఒళ్ళు జలదరించింది. కథను ఎలా చెప్పారో అలాగే తెరకెక్కించారు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనేది ఎంతటి సెనే్సషన్ క్రియేట్ చేసిందో, ఆంజనేయస్వామి గెటప్‌లో వున్నదెవరనే ప్రశ్న అందరిలో క్యూరియాసిటీ కలిగింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సూపర్బ్‌గా కుదిరింది అన్నారు.
శేఖర్ చంద్ర మాట్లాడుతూ- నేను హరర్, లవ్ సినిమాలకు సంగీతం అందించాను. కానీ రక్షకభటుడు సినిమా డిఫరెంట్ జోనర్‌లో ఉంది. ఇలాంటి సినిమాకు మ్యూజిక్ చేయడం ఛాలెంజింగ్‌గా అనిపించింది. దర్శకుడు వంశీకృష్ణ కొత్త ఐడియాతో సినిమా చశా. డెఫనెట్‌గా సనిమా సక్సెస్‌నిస్తుంది అన్నారు. వంశీకృష్ణ ఆకెళ్ళ మాట్లాడుతూ- శేఖర్ చంద్ర గత చిత్రాల మ్యూజిక్ విని మాస్ టచ్ ఉండే మ్యూజిక్ చేస్తాడా అనిపించింది నాకు. కానీ శేఖర్‌చంద్ర ఎక్స్‌ట్రార్డినరీ మ్యూజిక్ అందించారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా కుదిరింది. మోషన్ పోస్టర్‌కు, టీజర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆంజనేయస్వామి గెటప్‌లో వున్న హీరో ఎవరనే ఆసక్తి అందరిలో కలిగింది. మే ప్రథమార్థంలో సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం అన్నారు.