భయపెట్టనున్న టిక్ టాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిహెచ్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న హర్రర్, ఫన్, లవ్ కానె్సప్ట్ మూవీ సినిమా ‘టిక్ టాక్’. పోలిచర్ల హరనాథ్ నిర్మిస్తూ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రోమో విడుదల కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ లాబ్స్‌లో జరిగింది. ఈ సందర్భంగా హీరో, దర్శకుడు పోలిచర్ల హరనాథ్ మాట్లాడుతూ- హారర్ కామెడీ జోనర్‌లో అన్ని ఎలిమెంట్స్‌ను మిక్స్ చేసి చేసిన సినిమా ఇది. ఫ్యామిలీ అంతా కటలిసి చూసేలా సినిమా ఉంది. చాలా ఎంటర్‌టైనింగ్‌గా సినిమా ఉంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా సినిమా ఉంటుంది. పబ్లిసిటీ విషయంలో కూడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళతాం. తెలుగు సినిమాలో ఇప్పటివరకు ఎవరూ చేయని విధంగా ఓ సాంగ్‌ను పిక్చరైజ్ చేశాం. సినిమాలో అశ్లీలత ఉండదు అన్నారు. టి.ప్రసన్నకుమార్ మాట్లాడుతూ- హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్‌లో టిక్ టాక్ సినిమా చేశారు. ఈ సినిమా ఆయనకు చాలా పెద్ద హిట్ కావాలి అన్నారు. నిషిగంధ, వౌనిక, రాహుల్, సందీప్ ఆనంద్, సాయికృష్ణ, అల్లు రమేష్, రమణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి:పి.వంశీకృష్ణ, సంగీతం:ఎస్ అండ్ బి మ్యూజిక్ మిల్, ఎడిటర్:వెంకటరమణ, ఆర్ట్:ఇ.గోవింద్, మూలకథ:లిఖిత్ శ్రీనివాస్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, నిర్మాత, దర్శకత్వం:పోలిచర్ల హరినాథ్.