వెంకటాపురంలో టైసన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాహుల్, మహిమా మక్వాన్ జంటగా వేణు దర్శకత్వంలో గుడ్ సినిమా గ్రూప్ పతాకంపై శ్రేయాస్ శ్రీనివాస్, తూము ఫణికుమార్ సంయుక్తంగా రూపొందించిన సస్పెన్స్ థ్రిల్లర్ వెంకటాపురం. అచ్చు సంగీతం అందించిన ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో సీడీని తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- హ్యాపీడేస్‌లో ఓ హీరోగా నటించిన రాహుల్ ఈ చిత్రంతో బిజీ కావాలని కోరుకున్నారు. స్టార్స్‌తో సినిమా చేయకపోయినా ఈ చిత్రంలో పాటలన్నీ హిట్ అవుతాయని, అచ్చు వైవిధ్యమైన బాణీలు అందించారని లగడపాటి శ్రీ్ధర్ తెలిపారు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదలైనప్పటినుండీ అంచనాలు పెరిగాయని, లవర్ బాయ్‌గా రాహుల్ ఈ చిత్రంలో సిక్స్‌ప్యాక్‌లో కన్పిస్తాడని, తప్పక విజయవంతం అవుతుందని మల్టీడైమెన్షన్ వాసు తెలిపారు. టైసన్‌గా ఆకట్టుకున్న రాహుల్ ఈ చిత్రంలో కొత్త లుక్‌తో కన్పిస్తున్నాడని విజయ్ దేవరకొండ అన్నారు. సినిమా తాను చూశానని, చాలా బాగా వచ్చిందని కెమెరామెన్, దర్శకుడు అసలైన హీరోలుగా కన్పించాడని, రాహుల్ కథను నమ్మి ఈ చిత్రాన్ని చేశాడని, ప్రతి సన్నివేశాన్ని అద్భుతంగా చెక్కినట్టుగా రూపొందించారని దర్శకుడు మారుతి తెలిపారు. మహిమా మక్వాన్, రాహుల్, రాహుల్ రవీంద్రన్ తదితరులు పాల్గొన్నారు.