సక్సెస్‌ఫుల్‌గా బ్లాక్‌మనీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా 150 థియేటర్లలో విడుదల చేసిన బ్లాక్‌మనీ సినిమా అన్ని కేంద్రాల్లో అద్భుతమైన కలెక్షన్లు రాబడుతుందని, ఈ వారం తామే బాహుబలిగా నిలిచామని నిర్మాత సయ్యద్ నిజాముద్దీన్ తెలిపారు. మోహన్‌లాల్, ఆమలాపాల్ జంటగా జోషీ దర్శకత్వంలో మలయాళంలో రూపొందిన ‘రన్ బేబి రన్’ చిత్రాన్ని బ్లాక్‌మనీగా అనువదించి ఈనెల 21న విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం తెలుగులో ఘనవిజయం సాధించిందని నిర్మాత తెలియజేస్తున్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ- ఇంత మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు, విడుదలకు సహకరించిన పలువురు పెద్దలకు కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు. కార్యక్రమంలో సోనీ చరిష్ట తదితరులు పాల్గొన్నారు.