లక్ష్యమే ముఖ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్మైల్ పిక్చర్స్ పతాకంపై అర్జున్, భరత్, పావని, సీమాచౌదరి ప్రధాన తారాగణంగా ఎన్ రామస్వామి దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ఆదివారం ఉదయం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. అలీ క్లాప్ ఇవ్వగా బాపినీడు కెమెరా స్విచాన్ చేసారు. తనికెళ్ల భరణి తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు ఎన్ రామస్వామి మాట్లాడుతూ ప్రేమకంటే ప్రతి మనిషికి లక్ష్యమే ముఖ్యం అనే కథనంతో సినిమా రూపొందిస్తున్నామని, అన్ని ఎలిమెంట్స్ చిత్రంలో ఉంటాయని తెలిపారు. పోలీసు అధికారి అవ్వాలనుకున్న యువకుడి పాత్రలో తాను నటిస్తున్నానని, కథలో ఎంటర్‌టైన్‌మెంట్ మిక్స్ చేసి దర్శకుడు స్క్రిప్ట్‌ను తయారు చేసారని హీరో అర్జున్ తెలిపారు. ఈనెల మొదటి వారంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని నిర్మాత వెంకటరావు అన్నారు.