లవ్ బెలూన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జై అంజలి జంటగా 70 ఎంఎం ఫిలింస్ పతాకంపై ఎస్ శినీష్ దర్శకత్వంలో టిఎస్ అరుణ్ బాలాజీ, కందస్వామి నందకుమార్ సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘బెలూన్’. చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ కొడైకెనాల్‌లో చిత్రీకరించిన పాటలు, కీలకమైన సన్నివేశాలు సినిమాలో హైలెట్‌గా ఉంటాయని, అలాగే చెన్నైలో 50 లక్షలతో వేసిన సెట్‌లో రూపొందించిన సన్నివేశాలు సరికొత్తగా ఉంటాయని, ప్రధాన ప్రతినాయకుడు నాగినీడు నటన సినిమాకు హైలెట్‌గా ఉంటుందని వివరించారు. సినిమాకు సంబంధించి అంచనాలు పెరుగుతుండటంతో, బిజినెస్ పరంగానూ సంతృప్తికరంగా ఉందని, అందమైన ప్రేమకథతో రూపొందించిన చిత్రం యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. జనని అయ్యర్ మరో హీరోగా నటించిన ఈ చిత్రానికి కెమెరా ఆర్ శరవణన్, సంగీతం యువన్ శంకర్‌రాజా, దర్శకత్వం ఎస్ శినీష్.