రాబ్తా సాంగ్‌లో...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కథ, కథనం నచ్చడంతోపాటు ఆత్మీయులు అడిగిన ఆబ్లికేషన్స్ కోసం స్టార్ హీరోయిన్లు అప్పుడప్పుడు ప్రత్యేక పాటల్లో దర్శనమిస్తుంటారు. స్టార్ హీరోయిన్లు ఆ పాటలో నర్తించడం వల్ల సినిమాకి మరింత హైప్ వస్తుంది. ఇలాంటి ఆబ్లిగేషన్‌తోనే దీపికా పదుకొనె ‘రాబ్తా’ టైటిల్ సాంగ్‌లో నర్తించింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, కృతిసనన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘రాబ్తా’. దీపికా నటించిన స్పెషల్ టైటిల్ సాంగ్‌ను చిత్ర యూనిట్ గురువారం యూట్యూబ్‌లో విడుదల చేసింది. విడుదలైన కొద్ది గంటల్లోనే అత్యధిక వ్యూస్, లైక్స్‌తోపాటు దీపికా అద్భుతంగా డాన్స్ చేసిందంటూ ఆమె అభిమానులు సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపించారు. ఈ పాటలో దీపిక నటించడం గురించి దర్శకుడు దినేష్ విజన్ మాట్లాడుతూ ‘నేను దర్శకత్వం వహిస్తున్న తొలి చిత్రంలో దీపికా కూడా భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఆమె నాకు మంచి ఫ్రెండ్. ఈ పాట కోసం నేను అడిగిన వెంటనే బిజీ షెడ్యూల్స్ ఉన్నప్పటికీ నటించేందుకు అంగీకరించింది. గురువారం విడుదలైన ఈ పాటకు అత్యద్భుతమైన స్పందన లభించింది. ముఖ్యంగా దీపికా ఆటిట్యూడ్ సూపర్‌గా ఉందంటూ ప్రశంసలు లభించాయి. దీపికా నాకు లక్కీగాళ్. సాంగ్‌కి వస్తున్న రెస్పాన్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచిందని చెప్పారు. సైఫ్ అలీఖాన్, కరీనాకపూర్ నటించిన ‘ఏజెంట్ వినోద్’ చిత్రంలోని ‘రాబ్తా..’ పాటను రాబ్తా చిత్రం కోసం రీమిక్స్ చేసి ఉపయోగించడం విశేషం. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి జూన్ 9న ప్రేక్షకుల ముందుకు చిత్రాన్ని తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీపికా ప్రస్తుతం దర్శక, నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘పద్మావతి’ చిత్రంలో నటిస్తోంది.