అక్కడొకడుంటాడు...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామ్‌కార్తీక్, దీపిక జంటగా లైట్ హౌస్ సినీ మ్యాజిక్ పతాకంపై శ్రీపాద విశ్వక్ డైరెక్షన్‌లో శివశంకరరావు కంటగమనేని, కె వెంకటేశ్వరరావు సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘అక్కడొకడుంటాడు’. ఈ చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో జరిగింది. హరిబాబు క్లాప్ ఇవ్వగా రవీందర్‌రావు కెమెరా స్విచాన్ చేశారు. సి కల్యాణ్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా పాత్రికేయుల సమావేశంలో నిర్మాత వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సినిమా కథ కొత్తగా ఉంటుందని, ప్రతి పాత్ర ఆసక్తికరంగా రూపొందుతోందని అన్నారు. సింగిల్ షెడ్యూల్‌లో సినిమా పూర్తి చేస్తామన్నారు. అన్నివర్గాల ప్రేక్షకులను మెప్పించే కథనంతో రూపొందుతున్న చిత్రాన్ని వీలైనంత త్వరలో ప్రేక్షకుల ముందుకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని మరో నిర్మాత శివశంకరరావు అన్నారు.
పొరపాటుకు, తప్పుకు మధ్య జరిగే సంఘర్షణే సినిమా కథనమని, ప్రేమంటే అందాన్ని ఆకర్షించడం కాదని, వ్యక్తిత్వాన్ని ఆరాధించడం అన్న కథతో సాగుతుందన్నారు. ప్రేమికులు అనుకోకుండా విపత్కర పరిస్థితులకు లోనైనప్పుడు వారి స్వచ్ఛమైన ప్రేమ ఎలా కాపాడుకున్నారనే కథనంతో చిత్రం రూపొందుతోందని దర్శకుడు విశ్వక్ తెలిపారు. మే 2నుండి 20 వరకు శరవేగంగా షూటింగ్ చేస్తామన్నారు. కార్యక్రమంలో రామ్‌కార్తీక్, దీపిక తదితరులు పాల్గొని విశేషాలు తెలిపారు. శివహనీష్, భరత్, ఆర్‌ఎస్ నాయుడు, రాహుల్ తదితరులు నటిస్తున్న చిత్రానికి కెమెరా రాజాశేఖరన్ ఎస్, సంగీతం సార్క్స్, రచన, దర్శకత్వం శ్రీపాద విశ్వక్.