శ్రీమంతుడు, బాహుబలి హవా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తమ నటుడు మహేశ్‌బాబు, ఉత్తమ నటి శ్రుతిహాసన్, ఉత్తమ దర్శకుడు రాజవౌళి

మూడు అవార్డులు దక్కించుకున్న రంగీ తరంగ (కన్నడ) దర్శకుడు
అనూప్ భండారి

తెలుగు చలనచిత్ర సీమలో గతేడాది రికార్డుల మోత మోగించిన ‘బాహుబలి’, ‘శ్రీమంతుడు’ చిత్రాలు ‘ఐఫా’ వేడుకల్లోనూ సంచలనం రేపాయి. తొలిసారిగా దక్షిణాది సినిమాలకు ఐఫా అవార్డులను ప్రదానం చేస్తే వాటిలో ముఖ్యమైనవాటిని ఈ రెండు సినిమాలే కైవసం చేసుకున్నాయి. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో రెండురోజులపాటు సాగిన ఐఫా (ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమి) దక్షిణాది చిత్రరంగ అవార్డుల ప్రదానోత్సవం తొలిసారిగా జరిగింది. మలయాళ, తమిళ చిత్రసీమల్లో విశేష ప్రతిభ కనబరచినవారికి ఆదివారం రాత్రి అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా సోమవారం రాత్రి జరిగిన ముగింపు వేడుకల్లో తెలుగు, కన్నడ చిత్రసీమకు సంబంధించిన అవార్డులను ప్రకటించి అందచేశారు. తమిళంలో ఎక్కువ అవార్డులు కైవసం చేసుకున్న ‘బాహుబలి’ తెలుగులోనూ అదే హవా కొనసాగించింది. అయితే ప్రధానమైన అవార్డులను ‘శ్రీమంతుడు’కు దక్కడం విశేషం. అటు కన్నడంలో ‘రంగితరంగ’కు ఎక్కువ అవార్డులు దక్కగా ఒకేవ్యక్తికి మూడు అవార్డులు వరించడం మరో విశేషం.
తెలుగులో..
ఉత్తమ చిత్రంగా ‘బాహుబలి’, ఉత్తమ దర్శకుడిగా ఆ చిత్ర దర్శకుడు రాజవౌళికి అవార్డులు దక్కాయి. మొత్తంమీద ఈ సినిమాను 8 అవార్డులు వరించాయి. ఉత్తమ నటుడిగా మహేశ్‌బాబు (శ్రీమంతుడు), ఉత్తమ నటిగా శ్రుతిహాసన్ (శ్రీమంతుడు) ఎంపికయ్యారు. ఉత్తమ నేపథ్యగాయనిగా సత్యయామిని (బాహుబలి), ఉత్తమ నేపథ్యగాయకుడిగా సాగర్ (జతకలిసే పాట -శ్రీమంతుడు), ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవిశ్రీప్రసాద్ (శ్రీమంతుడు) కైవసం చేసుకున్నారు. ఇక ఉత్తమ విలన్‌గా రానా (బాహుబలి), ఉత్తమ సహాయనటుడిగా జగపతిబాబు (శ్రీమంతుడు), ఉత్తమ కమెడియన్‌గా వెనె్నలకిషోర్ (్భలెభలేమగాడివోయ్), ఉత్తమ గేయ రచయితగా రామజోగయ్యశాస్ర్తీ (శ్రీమంతుడు) కైవసం చేసుకున్నారు.
కన్నడలో...
కన్నడ చిత్రసీమలో గతేడాది విడుదలైన ‘రంగితరంగ’ చిత్రం 8 అవార్డులతో ఐఫాలో సంచలనం రేపింది. ఉత్తమచిత్రం అవార్డుతోపాటు మరెన్నో పురస్కారాలు ఈ చిత్రానికి దక్కాయి. ఉత్తమ దర్శకుడి, ఉత్తమ గేయరచయిత, ఉత్తమ సంగీత దర్శకుడిగా మూడు అవార్డులు ఆయనను వరించాయి. ఉత్తమనటుడిగా నిమ్మయాస్ (రంగితరంగ), ఉత్తమనటిగా రాధికా పండిట్ (మిస్టర్ అండ్ మిసెస్ రామాచారి), ఉత్తమ సహాయనటుడిగా సాయికుమార్ (రంగితరంగ), ఉత్తమ సహాయనటిగా లక్ష్మీరాజ్ (కృష్ణలీల), ఉత్తమ నేపథ్యగాయడిగా ధనుష్ (వజ్రకాయ), ఉత్తమ నేపథ్యగాయనిగా శ్రేయాఘోషాల్ (మిస్టర్ అండ్ మిసెస్ రామాచారి), ఉత్తమ మహిళ హాస్యనటిగా సాధుకోకిల (మిస్టర్ అండ్ మిసెస్ రామాచారి) నిలిచారు. సోమవారం అర్థరాత్రివరకు సాగిన అవార్డుల ప్రదానోత్సవంలో తెలుగు, కన్నడ చిత్రసీమలకుచెందిన అతిరథ మహారథులు హాజరై కనువిందు చేశారు.