వాసుకి ఫస్ట్‌లుక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నయనతార కథానాయికగా మలయాళంలో రూపొందించిన ‘పుదియ నియమం’ చిత్రాన్ని తెలుగులో ‘వాసుకి’గా అనువదించారు. శ్రీరామ్ సినిమా పతాకంపై ఎస్‌ఆర్ మోహన్ ఈ చిత్రాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో పాటుగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. చిత్రానికి సంబంధించి ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను నటుడు వరుణ్‌తేజ్ శుక్రవారం ఉదయం విడుదల చేశారు. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ మలయాళంలో బ్లాక్‌బస్టర్ అయిన సినిమా, అదే స్థాయిలో తెలుగులోనూ హిట్టవుతుందన్న నమ్మకం కలుగుతుందన్నారు. నయనతార అద్భుత నటన సినిమాకు హైలెట్‌గా ఉంటుందని తెలిపారు. పొరుగు భాషలో హిట్‌కొట్టిన సినిమా, తెలుగులోనూ నిర్మాతలకు మంచి ఫలితాలు అందివ్వాలని నాగబాబు ఆకాంక్షించారు. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు అవుతున్నాయని, వెంటనే విడుదలకు సన్నాహాలు చేస్తామని నిర్మాత ఎస్‌ఆర్ మోహన్ వెల్లడించారు. కార్యక్రమంలో చిత్ర బృందం మరిన్ని విశేషాలు తెలిపింది.