సక్సెస్‌లో వెంకటాపురం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాహుల్, మహిమా మక్వానా జంటగా వేణు మడికంటి దర్శకత్వంలో గుడ్ సినిమా గ్రూప్, బహుమాన్య ఆర్ట్స్ పతాకంపై తూము ఫణికుమార్, శ్రేయా శ్రీనివాస్ నిర్మించిన ‘వెంకటాపురం’ చిత్రం ఇటీవలే విడుదలై మంచి టాక్‌తో రన్ అవుతోన్న సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్‌ను ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా హీరో రాహుల్ మాట్లాడుతూ- సినిమా విడుదలకు ముందు చాలా టెన్షన్ పడ్డాను. ఇలాంటి కొత్త కానె్సప్ట్‌తో వస్తున్న చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారా లేదా అని. కానీ విడుదలైన తరువాత అనూహ్యమైన స్పందన వచ్చింది. ముఖ్యంగా మ్యాట్నీ నుంచి కలెక్షన్లు పెరిగాయి. ఎక్కడ చూసినా బాగుందని టాక్ రావడంతో సినిమాకు ప్రేక్షకులకు పెరిగారు. ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థాంక్స్. దర్శకుడు వేణు మాట్లాడుతూ- కొత్త స్క్రీన్‌ప్లేతో తెరకెక్కించిన సినిమా ఇది. ఓ రియల్ సంఘటన ఇన్‌స్పిరేషన్‌తో రూపొందించిన ఈ సినిమా విడుదలై పాజిటివ్ టాక్‌తో రన్ అవడం ఆనందంగా ఉంది అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ- ఎంతో కష్టపడి చేసిన చిత్రమిది. దాదాపు 250 థియేటర్‌లలో విడుదల చేసిన ఈ సినిమాకు అన్ని ఎరియాలనుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా పరిశ్రమ నుండి కూడా రెస్పాన్స్ రావడం ఆనందంగా ఉంది. రేపటినుండి మరో 50 థియేటర్లు పెరుగుతున్నాయి. ముఖ్యంగా మల్టీప్లెక్స్‌ల్లో షోలు పెరిగాయన్నారు.