పోలీస్ దేవుడే రాధ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యువ హీరో శర్వానంద్, లావణ్య త్రిపాఠి జంటగా చంద్రమోహన్ దర్శకత్వంలో బివిఎస్‌ఎన్ ప్రసాద్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై భోగవల్లి బాపినీడు నిర్మించిన ‘రాధ’ ఇటీవలే విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా చిత్ర సమర్పకుడు భోగవల్లి ప్రసాద్ మాట్లాడుతూ ఇటీవల విడుదలైన రాధ చిత్రానికి అనూహ్య స్పందన వస్తోంది. ముఖ్యంగా ఎంటర్‌టైన్‌మెంట్ బాగుందన్న ప్రశంసలు అందుతున్నాయి. పోలీస్ అంటే దేవుడు అనే మెసేజ్‌ని ఈ చిత్రం ద్వారా అందించాం. ప్రతి పోలీసు కుటుంబం చూడాల్సిన చిత్రమిదని అన్నారు. సమాజంలో పోలీసు విలువ పెంచేలా తెరకెక్కిన చిత్రమని, హీరో శర్వానంద్ అద్భుతంగా చేశాడని కితాబునిచ్చారు. నిజానికి చాలా సినిమాల్లో పోలీసుని నెగెటివ్‌గా చూపిస్తున్నారు. కానీ వాళ్లు మనకోసం ఎంతో చేస్తున్నారు. అందుకనే వాళ్లను దేవుడితో పోల్చామని భోగవల్లి వివరించారు. ‘35 ఏళ్ళుగా పరిశ్రమలో నిర్మాతగా ఉన్నాను. ఇది మా బ్యానర్ నుంచి వస్తున్న 23వ చిత్రం. ఎన్నో పెద్ద చిత్రాల్ని నిర్మించిన నేను కొత్త కథలతో వస్తున్న న్యూ టాలెంట్‌ను ప్రోత్సహించేందుకు మా అబ్బాయి బాపినీడు మినిమమ్ బడ్జెట్‌లో సినిమాలు తీస్తున్నాడు. నిన్న థియేటర్‌లో సినిమా చూశాను. ఎంటర్‌టైన్‌మెంట్ అంశాలతో ప్రేక్షకులు ఈలలు గోలలు చేస్తున్నారు. దర్శకుడు చంద్రమోహన్ కథను అద్భుతంగా నడిపించాడు. శర్వానంద్ కెరీర్‌లో మంచి ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమా తరువాత వరుణ్‌తేజ్‌తో వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. దాంతోపాటు ఓ స్టార్ హీరోతో భారీ సినిమా ఉంటుంది’ అన్నారు.