మహేష్‌తో జక్కన్న?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెయ్యి కోట్లు వసూలు చేసిన బాహుబలితో రాజవౌళి సంచలన దర్శకుడైపోయాడు. ప్రస్తుతం విదేశాల్లో హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్న రాజవౌళి, ఓ మంచి ఎంటర్‌టైనర్ చిత్రంతో రావడానికి కసరత్తులు చేస్తున్నాడన్న టాక్ పరిశ్రమలో మొదలైంది. ప్రస్తుతం టాప్ స్టార్ హీరోల్లో క్రేజీ ప్రాజెక్టులు చేస్తున్న మహేష్‌బాబుతో ఓ చిత్రాన్ని రూపొందించడానికి రంగం సిద్ధమైందన్నది కొత్త కథనం. నిజానికి బాహుబలి కంటే ముందే మహేష్‌తో సినిమా చేయడానికి రాజవౌళి కమిటయ్యాడు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కెఎల్ నారాయణ నిర్మిస్తాడని అప్పట్లో వార్తలు సైతం వచ్చాయి. బాహుబలితో ఐదేళ్లు బిజీ అయపోయన జక్కన్న, ఇప్పుడు తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అంశాలపై దృష్టి పెట్టవచ్చని అంటున్నారు. వచ్చే ఏడాదిలో చిత్రం సెట్స్‌పైకి వస్తుందని అంటున్నారు సినీవర్గాలు.