త్వరలో నీలంపాటి అమ్మోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్యామ్, శ్రీకీర్తిక, సుమన్ ప్రధాన తారాగణంగా నవ్య మూవీ మేకర్స్ పతాకంపై తోట కృష్ణ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘నీలంపాటి అమ్మోరు’. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్ట్ఫికెట్ అందుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా తోట కృష్ణ మాట్లాడుతూ 700 సంవత్సరాల క్రితం గుంటూరు జిల్లా అడిగొప్పుల గ్రామంలో వెలసిన నీలంపాటి అమ్మవారి జీవిత కథ, మహిమలను ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని చిత్రాన్ని రూపొందించామన్నారు. గ్రాఫిక్స్, సంగీతం సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయన్నారు. ఐదు పాటలున్న ఆడియో విడుదల చేశామని, అన్ని పాటలకు మంచి ఆదరణ లభిస్తోందని, త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్టు చెప్పారు. సినిమాలో అమ్మవారి భక్తుడిగా చేసిన పాత్ర తనకు సవాల్ లాంటిదని, ఈ చిత్రంలో నటించడం సంతృప్తినిచ్చిందని, అమ్మవారి పాత్రలో నటించిన బేబి వైష్ణవి ఆకట్టుకుంటుందని నటుడు సుమన్ తెలిపారు.