పదేళ్ల కెరీర్‌లో నటుడిగా ఇమేజ్ -నిఖిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కమర్షియల్ సినిమాలను అందరూ ఎంచుకుంటుంటే, తాను మాత్రం రొటీన్ సినిమాల్ని పక్కనబెట్టి, ఒకే ఇమేజ్ చట్రంలో ఇరుక్కోకుండా ఎప్పటికప్పుడు కొత్త కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు యువ హీరో నిఖిల్. రివెంజ్ డ్రామాతో నిఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ‘కేశవ’. సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా 19న విడుదలవుతున్న సందర్భంగా హీరో నిఖిల్‌తో ఇంటర్వ్యూ...
* టెన్షన్‌గా ఫీలవుతున్నారా?
- బాహుబలి లాంటి సినిమా ఇంకా స్ట్రాంగ్‌గా నడుస్తున్న సమయంలో నా సినిమా రిలీజవుతుండటం కాస్త టెన్షన్‌గా ఉంది. పైగా మొదటిసారి చాలా భిన్నంగా ట్రై చేశాను. ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలని ఉంది. లోపల సినిమాపై నమ్మకం ఉన్నా కూడా కాస్త టెన్షన్‌గా ఉంది.
* మీ కెరీర్‌లో కేశవ భారీ సినిమా అనుకోవచ్చా?
- అవును. ఈ సినిమా పరంగా నాకు భారీ సినిమా. పైగా ఇదే నాకు అతి పెద్ద రిలీజ్. 650 థియేటర్లలో సినిమా విడుదలవుతోంది. ఆస్ట్రేలియా లాంటి చోట్ల నా సినిమా విడుదలవడం ఇదే మొదటిసారి. చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది.
* ఇంతకీ ‘కేశవ’ ఎవరు?
- ఇది కేశవాచారి అనే యువకుని కథ. ఇతనికి కాస్త హార్ట్ సమస్య ఉంటుంది. ఎక్కువగా టెన్షన్ పడ్డా, ఎక్కువగా ఆనందపడ్డా బ్రతికే అవకాశం చాలా తక్కువ. అలాంటి వ్యక్తి జీవితంలో జరిగిన సంఘటనలతో వాళ్ళపై ఎలా రివెంజ్ తీర్చుకున్నాడు. ఇదో రివెంజ్ డ్రామా సినిమా. మొదటిసారి పూర్తి స్థాయి సీరియస్ సబ్జెక్ట్ చేసే ఛాన్స్ దక్కింది. అంతేగాక నాలోని నటనను బయటపెట్టడానికి ఈ స్క్రిప్ట్‌లో చాలా అవకాశముంది. నా పాత్ర ద్వారా జనరేట్ అయిన ఎమోషన్స్ ఆశ్చర్యం కలిగిస్తాయి.
* మళ్లీ సుధీర్‌వర్మతో చేయడం ఎలా ఉంది?
- సుధీర్ మంచి కథ చెప్పాడు. పైగా నటనకు ఆస్కారమున్న సబ్జెక్టు కావడంతో ధైర్యంగా ముందుకు వెళ్ళాం. ఒకసారి షూటింగ్‌కు వెళ్ళాక డైరెక్టర్‌కి సలహాలివ్వడం లాంటివేమీ చెయ్యను. అంతా వాళ్ళకే వదిలేస్తాను. బాహుబలి హవాలో కూడా మా సినిమా మంచి హైప్ తెచ్చుకుంది. అది మంచి ఓపెనింగ్స్ రావడానికి ఉపయోగపడుతుంది. మొదటి మూడు వారాల్లో మంచి కలెక్షన్లు వస్తే నిర్మాతలు సేఫ్‌జోన్‌లోకి వెళతారు.
* నటుడిగా పదేళ్ళయింది.. ఎలా ఉంది?
- ఇనే్నళ్లు ఇండస్ట్రీలో ఉండగలిగినందుకు చాలా లక్కీగా ఫీలవుతున్నాను. ఇక్కడ చాలా కాంపిటీషన్ ఉంటుంది. ఆటలో ఉండాలంటే ఒకేసారి చాలా పనులు చేయాల్సి ఉంటుంది. నా వరకు అన్నీ సక్రమంగానే జరిగాయి. ఇకపై కూడా ఇలాగే జరగాలని కోరుకుంటున్నాను.
* హీరోకి ఏదో సమస్య ఉన్న కథలను
ఎంచుకుంటున్నారు, ఎందుకు?
- అలా అని కాదు. భిన్నమైన కథలను ఎంచుకుంటున్నా. లక్కీగా నాకు అన్నీ భిన్నమైన సినిమాలే వస్తున్నాయి. తెలుగు పరిశ్రమలో కూడా మార్పొచ్చింది. ఇకపై కూడా దర్శకులు నా వద్దకు డిఫరెంట్ కథలతోనే వస్తారని అనుకుంటున్నాను. నేను తర్వాత చేయబోయే సినిమాలు కూడా వేటికవి పూర్తి భిన్నంగా ఉంటాయి.
* నెక్స్ట్ ప్రాజెక్ట్స్?
రాజు సుందరం డైరెక్షన్‌లో కాలేజ్ బ్యాక్ డ్రాప్‌లో ఉండే సినిమా చేస్తున్నాను. దాని తర్వాత చందు మొండేటి డైరెక్షన్‌లో ‘కార్తికేయ’కు సీక్వెల్ చేస్తున్నాను. ఆ తర్వాత ఒక యాక్షన్ సినిమా కూడా ఉంది.

-శ్రీ