రాయ్ లక్ష్మి షాకింగ్ కామెంట్స్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వివాదాలతో చెలిమి చేయడం రాయ్ లక్ష్మికి కొత్తేమీ కాదు. అప్పట్లో క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనితో ఓపెన్‌గానే చెట్టపట్టాల్ వేసుకుని తిరిగిన ఈ అమ్మడు.. ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. ఆ తర్వాత పలు సందర్భాల్లో బోల్డ్ స్టేట్‌మెంట్‌లతో హీట్ పెంచింది. ఇక ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో సామాజిక మాధ్యమాల్లో వేడెక్కించే ఫొటోల్ని అప్‌లోడ్ చేస్తూ టాక్ ఆఫ్ ది టౌన్ అవుతోంది. ప్రస్తుతం మరోసారి ఇండస్డ్రీని షేక్ చేసే కామెంట్‌తో వార్తల్లోకొచ్చింది. ‘‘అందమైన అమ్మాయిలతో సినిమా నిర్మాతలు శృంగారం కోరుకుంటారు. అందుకోసం చుట్టూ వలలు వేస్తారు’’ అంటూ ఘాటైన కామెంట్ చేసి సంచలనం సృష్టించింది. సినిమా నాయికలతో నిర్మాతలు శృంగారం కోసం వెంపర్లాడిపోతారంటూ బోల్డ్ స్టేట్‌మెంట్ ఇచ్చి ఇండస్ట్రీ వర్గాల్ని షాక్‌కి గురిచేసింది. సినిమాల్లో నటీమణులకు అవకాశాలు పెరగాలంటే అది తప్పదని సెలవిచ్చింది. కొందరు ఫిలిం మేకర్స్ పర్సనల్ అవసరాల కోసమే సినిమాలు తీస్తారు.. ఎంతోమంది నటీమణులు నిర్మాతలతో అడ్జెస్ట్ అవడం తాను చూశానని ఓపెన్‌గా చెప్పి ప్రకంపనాలు పుట్టించింది. రాయ్ లక్ష్మి లేటెస్ట్ కామెంట్ ఇండస్ట్రీ వర్గాల్లో పెను ప్రకంపనలు పుట్టిస్తోంది. మరి కామెంట్స్ ఎంతవరకు దారితీస్తాయో చూడాలి.