ఇదోప్రేమలోకం ఆడియో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అశోక్‌చంద్ర, తేజారెడ్డి, కారుణ్య ప్రధాన తారాగణంగా శ్రీ శ్రీనివాసా ఫిలింస్ పతాకంపై కరణ్‌రాజ్ దర్శకత్వంలో ఎస్.పి.నాయుడు రూపొందించిన చిత్రం ‘ఇదో ప్రేమలోకం’. వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించిన ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. సాయివెంకట్ తొలి సీడీని విడుదల చేసి నరేశ్‌కు అందజేశారు. ఈ సందర్భంగా నరేశ్ మాట్లాడుతూ- ఈ ప్రేమకథలో ఓ కొత్త కోణం వుంటుందని, దర్శకుడు గొప్పవాడైనా చక్కగా చిత్రీకరించాడని, సినిమా విజయవంతం కావాలని కోరుకున్నారు. దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమాను రూపొందించామని, నరేశ్ పాత్ర హైలెట్‌గా వుంటుందని, వందేమాతరం అందించిన బాణీలు అందరికీ నచ్చుతాయని నిర్మాత ఎస్.పి.నాయుడు అన్నారు. నరేశ్ నటన ఈ సినిమాలో కన్నీళ్ళు తెప్పిస్తుందని, ఆయనకి ఈ సినిమా ద్వారా ఓ అవార్డు వస్తుందని తాము భావిస్తున్నామని దర్శకుడు కరణ్‌రాజ్ అన్నారు. హీరో కొత్తవాడైనా మంచి ఈజ్‌తో నటించాడని, అందరికీ నచ్చేలా రూపొందిన ఈ సినిమా హిట్ అవుతుందని ఆయన అన్నారు. కార్యక్రమంలో సినిమా యూనిట్ పాల్గొని విశేషాలు తెలిపారు. సుమన్, భగవాన్, మేల్కొటె తదితరులు నటించిన ఈ చిత్రానికి పాటలు:చిలుకరెక్క గణేశ్, టి.కరణ్‌రాజ్, కరుణాకర్, కెమెరా:కె.శివ, నిర్మాత:ఎస్.పి.నాయుడు, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:టి.కరణ్‌రాజ్.