అంతకుమించి కనిపిస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టైటిల్‌కు కరెక్ట్‌గా సరిపోయే కథనం అంతకుమించి. నిజంగానే ఈ చిత్రంలో అంతకుమించి కనిపిస్తా. ఈ సినిమాలో నా పాత్ర పేరు మధుప్రియ. ఇలాంటి పాత్ర నా కెరీర్‌లో ఇదే మొదటిసారి. హారర్ సినిమా అనగానే ముందే కొన్ని సన్నివేశాలు వూహించేస్తుంటాం. అయితే ఈ చిత్రంలో ఒక్క సన్నివేశం కూడా ఊహకు అందదు. నాకు పూర్తి సంతృప్తినిచ్చిన సినిమా అంటోంది నటి రష్మి. రష్మి, సతీష్ జై జంటగా ఎస్.జై ఫిలింస్ పతాకంపై జానీ దర్శకత్వంలో సతీష్, భానుప్రకాష్ తేళ్ళ, కన్నా సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘అంతకుమించి’. హారర్ నేపథ్యంలో విభిన్నమైన కానె్సప్టుతో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు దర్శకుడు జానీ తెలిపారు. రష్మిని ఇప్పటివరకూ చూడని సరికొత్త తరహా పాత్రలో చూపిస్తున్నామని, హైదరాబాద్‌లో సాగుతోన్న చివరి షెడ్యూల్ శరవేగంగా జరుపుతున్నామన్నారు. నెలాఖరుకు షూటింగ్ పూర్తిచేసి వచ్చే నెలలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్టు నిర్మాత సతీష్ తెలిపారు. కథపై నమ్మకంతో సినిమాను వైవిధ్యంగా రూపొందిస్తున్నారని, మన చుట్టుప్రక్కల వుండే సాదా సీదా కుర్రాడిగా కనిపిస్తానని నటుడు సతీష్ జై తెలిపారు. 70 శాతం షూటింగ్ పూర్తిచేసిన సినిమా మిగతా 30 శాతం షూటింగ్ జరుగుతోందని, పాటల చిత్రీకరణకు గోవా వెళ్తున్నట్టు చెప్పారు. అన్ని పాత్రలు సినిమాలో సహజంగా కనిపిస్తాయని, ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ఫామ్ హౌస్‌లో చివరి షెడ్యూల్ చేస్తున్నామన్నారు. సూర్య, మధునందన్, రవిప్రకాష్ తదితరులు నటిస్తున్న చిత్రానికి కెమెరా బాల్‌రెడ్డి, సంగీతం సునీల్ కశ్యప్, మాటలు మోహన్ చందా, నిర్మాత సతీష్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం జానీ.