శ్రీకాంత్.. రా..రా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాంత్, నాజియా జంటగా విజి చెర్రీస్ విజన్స్ పతాకంపై నిర్మాత విజయ్ రూపొందిస్తున్న చిత్రం ‘రా..రా’. తొలి కాపీ సిద్ధమైన ఈ చిత్రం వచ్చే నెలలో విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ హాస్యంతో కూడిన హారర్ థ్రిల్లర్‌గా సాగే చిత్రంలో మనుషులకు దెయ్యాలకు మధ్య జరిగ సరదా ఆటలు ప్రేక్షకుల్ని వినోదాల తీరంలో విహరింపజేస్తాయన్నారు. ఈ జోనర్‌లో తొలిసారిగా నటిస్తున్నానని, అందరికీ నచ్చేలా సినిమా ఉంటుందన్నారు. చిరంజీవి విడుదల చేసిన మోషన్ పోస్టర్‌కు మంచి స్పందన లభించిందని, ఈనెలలో టీజర్‌ను విడుదల చేయనున్నట్టు నిర్మాత విజయ్ తెలిపారు. గిరిబాబు, సీత, నారాయణ, అలీ, రఘుబాబు, పోసాని తదితరులు నటిస్తున్న చిత్రానికి సంగీతం రాప్ రాక్ షకీల్, కెమెరా పూర్ణ, ఎడిటింగ్ శంకర్, నిర్మాత విజయ్, దర్శకత్వం విజీ చరిష్ యూనిట్.