అప్పుడే పెళ్లా?
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
గత దశాబ్దకాలంగా హీరోయిన్‌గా కెరీర్ కొనసాగిస్తున్న హాట్ భామ రాయ్ లక్ష్మికి ఇప్పటికీ సరైన బ్రేక్ రాలేదు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా కెరీర్ సాగుతున్నా కమర్షియల్ హీరోయిన్‌గా బ్రేక్‌నిచ్చే ప్రాజెక్టు ఆమెకు ఒక్కటీ పడలేదు. దాంతో తనకి వచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటూ వెళ్తోంది. కొద్దికాలంగా ఐటెంగాళ్ అవతారం ఎత్తిన రాయ్‌ని పెళ్లెప్పుడు? అని అడిగినవారికి సరైన సమాధానమే చెబుతోంది. ‘అప్పుడే నా పెళ్లి గురించి ఆలోచించాల్సిన అవసరం ఏముంది? 30లు దాటినవాళ్లే పెళ్లి ఊసెత్తకుండా కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా సాగిస్తున్నారు. కెరీర్‌లో సరైన సక్సెస్ చూసే సమయాన్ని కాదనుకుని, పెళ్లికి నేనెందుకు తొందరపడాలి?’ అని ఎదురు ప్రశ్నిస్తోంది. అంటే, ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదని, కెరీర్‌పైనే దృష్టి పెట్టినట్టు చెప్పకనే చెబుతోంది. ‘సరైన బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నా’ అన్నది రాయ్ వేస్తున్న ముక్తాయింపు కౌంటర్.