అంత సీన్ లేదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తనదైన గ్లామర్‌తో ఆకట్టుకున్న అందాల భామ రెజీనా తక్కువ టైమ్‌లోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఆమె నటించిన సినిమాలు విజయం సాధించినా ఈమెకు స్టార్ హీరోల సరసన అవకాశాలు అందుకోలేకపోయింది. ప్రస్తుతం తెలుగులో అవకాశాలు బాగా తగ్గి పోవడంతో తమిళంపై దృష్టిసారించింది. ఈమధ్య రెజీనా ప్రమోషన్లకు రావడం లేదని, కేవలం షూటింగ్‌లకే పరిమితమవుతోందని నిర్మాతలు గగ్గోలు పెడుతున్నారు. ఈ విషయంపై స్పందించిన రెజీనా తాను ఎన్నటికీ అలా చేయనని, సినిమా ప్రమోషన్ విషయంలో ఎప్పుడూ ముందుంటానని, ముఖ్యంగా తమిళంలో వరసగా ఐదు సినిమాలు చేస్తుండటంతో సమయం లేకే ప్రమోషన్లకు రావడం లేదని, అంతేకానీ మరే కారణమూ కాదని చెబుతోంది. ఏదో ఒక ఈవెంట్‌కు వెళ్లకపోయినంత మాత్రాన నానా రభస చేస్తారా అంటూ ఫైర్ అవుతోంది.