డబుల్ బొనాంజా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం మహేష్‌బాబు హీరోగా రూపొందుతున్న బ్రహ్మోత్సవం చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తర్వాత మహేష్ తన తదుపరి చిత్రానికి అప్పుడే సన్నాహాలు మొదలుపెట్టాడు. ప్రముఖ తమిళ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్‌వర్క్ జరుపుకుంటోంది. దాదాపు 100 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కే ఈ చిత్రంలో మహేష్ ద్విపాత్రాభినయం చేస్తాడని కోలీవుడ్ సమాచారం.
సోషల్ అవేర్‌నెస్ కథాంశంతో తెరకెక్కే ఈ సినిమాలో మహేష్ రెండు భిన్నమైన షేడ్స్‌లో కనిపిస్తాడట. ఇప్పటివరకూ మహేష్ ద్విపాత్రాభినయం చేసే చిత్రం ఇదే కావడం విశేషం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో అధికారికంగా వెల్లడికానున్నాయి.