రెండు భాషల్లో మరకతమణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆది పినిశెట్టి, నిక్కీ గల్రాణి జంటగా ఎఆర్‌కె శరవణన్ దర్శకత్వంలో రిషి మీడియా, శ్రీచక్ర ఇన్నోవేషన్స్ పతాకాలపై సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘మరకతమణి’. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ కేశవ హీరో నిఖిల్ విడుదల చేశాడు. టీజర్ విడుదల సందర్భంలో నిర్మాతలు మాట్లాడుతూ మరకతమణిని తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి జూన్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని, మలుపులాంటి సినిమా తరువాత ఆది నటించిన ఈ సినిమా వైవిధ్యమైన కథతో సాగుతుందన్నారు. అడ్వెంచర్ ఘోస్ట్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు దిబూ థామస్ తొలిసారిగా సంగీతం అందిస్తున్నారని, గాయకుడు అనిల్ కామరాజు సినిమాలో నటించడమేకాక ఓ పాట కూడా పాడారని, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం కామెడీ హైలెట్‌తో సినిమా అందరికీ నచ్చుతుందన్నారు. ఆనంద్‌రాజ్, అరుణ్‌రాజ్, రాందాస్ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.