టీజర్‌కు రెడీ అవుతున్నా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూపర్ స్టార్ మహేష్‌బాబు హీరోగా క్రేజీ దర్శకుడు మురుగదాస్ రూపొందిస్తున్న స్పైడర్ చిత్రం ప్రస్తుతం చెన్నయ్‌లో క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణలో బిజీగా ఉంది. భారీ బడ్జెట్‌తో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న సినిమాపై అంచనాలూ ఆకాశాన్ని అంటాయి. ఇటీవల విడుదలైన ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన రావడంతో అటు బిజినెస్‌పరంగానూ సంచలనం సృష్టిస్తోంది. ఈనెల 31న సినిమా టీజర్ విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. అందుకు కారణం ఆరోజు సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు. ఆ సందర్భంగానే టీజర్ విడుదల చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. మహేష్ తన ప్రతి సినిమాకూ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఏదోక కార్యక్రమం నిర్వహించి తన ఫ్యాన్స్‌నీ ఖుషీ చేయడం పరిపాటి. ఆ విధంగానే స్పైడర్ టీజర్ విడుదలవుతోంది. రకుల్‌ప్రీత్‌సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్న సినిమాను ముందుగా అనుకున్నట్టు జూన్ 23న కాకుండా ఆగస్టులో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.