సినిమాలు మానేస్తా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ నటుడు కమల్‌హాసన్ సినిమాలు తీయడం మానేస్తానని అంటున్నాడు. అవునా ఎందుకంటే.. కేంద్ర ప్రభుత్వం అమలుచేసిన జిఎస్‌టి బిల్లు విషయంలో సినిమా పరిశ్రమపై 28 పర్సెంట్ పడిందని, ఈ పన్ను శాతాన్ని తగ్గించకపోతే తాను సినిమాలుచేయడం మానేస్తానని అన్నాడు. జులై 1నుండి అమలయ్యే ఈ పన్నుపై ఆయన వ్యతిరేకత వ్యక్తం చేసారు. ఒకే దేశం ఒకే పన్ను విషయాన్ని స్వాగతిస్తున్నానని, అయితే సినీ రంగంపై 28 శాతం పన్ను విధించడం ప్రాంతీయ సినీ పరిశ్రమకు తీవ్ర నష్టాలు వస్తాయని తెలిపారు. ప్రాంతీయ సినిమాను, జాతీయ, అంతర్జాతీయ సినిమాలతో పోల్చడం సరికాదని, నిత్యావసరాల మాదిరిగా పన్నువిధానం సినిమా రంగంపై విధించడం సరికాదని అన్నారు. తమిళనాడులో క్లీన్ యూ సర్ట్ఫికెట్, తమిళ భాషలో ఉన్న పేర్లతో రూపొందించే సినిమాలకు పన్ను రద్దు విధానం ఉంది. జీఎస్టీ విధానంవల్ల ఈ సినిమాలకు రాయితీ కుదరదు. అందుకనే తమిళ సినీ ప్రముఖులు ఈ విషయంపై తీవ్రంగా విమర్శిస్తున్నారు.