జూలైకి నిన్నుకోరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాని కథానాయకుడుగా డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎల్‌ఎల్‌పి పతాకంపై శివ నిర్వాణ దర్శకత్వంలో డి.వి.వి.దానయ్య రూపొందిస్తున్న చిత్రం నిన్ను కోరి. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తిచేసి, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ఇటీవల విడుదలైన ఆడిగా అడిగా.. యదలో లయలడిగా అనే ప్రమోషన్ పాటకు మంచి ఆదరణ లభిస్తోందని, తాను తొలిసారిగా నానితో చేస్తున్న ఈ సినిమా కథ అనుగుణంగా ఎక్కువశాతం షూటింగ్ అమెరికాలో జరుపుకుందని తెలిపారు. హైదరాబాద్, వైజాగ్‌లలో షెడ్యూల్స్ చేశామని, గోపీసుందర్ అన్ని హిట్ పాటలు ఇచ్చారని, అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి జూలై 7న సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నామని తెలిపారు. ఓ వైవిధ్యమైన అంశంతో ఈ సినిమా ప్రేక్షకులకు ఫుల్‌ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తుందని, ఆదితో కలిసి నటించడం మరో సంతోషకరమైన విషయమని, తన కెరీర్‌లో ఈ సినిమా ఓ మైలు రాయిలా నిలుస్తుందని కథానాయకుడు నాని అన్నారు. దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమాలో తాను నటించానని, తన పాత్రను డిజైన్‌చేసిన విధానం ప్రేక్షకులకు నచ్చుతుందని హీరో అది తెలిపారు. స్క్రీన్‌ప్లే బేస్డ్ కథనంతో సాగే ఈ చిత్రంలో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని ఆయన అన్నారు. కార్యక్రమంలో కోనవెంకట్, నివేద థామస్, శివ నిర్వాణ తదితరులు విశేషాలను తెలిపారు.