పవన్-నితిన్.. ఓ త్రివిక్రమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యంగ్ హీరో నితిన్‌కు పవన్‌కళ్యాణ్ అంటే ఎంత అభిమానమో వేరే చెప్పనక్కర్లేదు. అలాగే త్రివిక్రమ్, నితిన్‌ల కాంబినేషన్ ఎలా ఉంటుందో ‘అ.. ఆ’ సినిమాతో రుజువైపోయింది. ఇలాంటి ఈ రెండు ముచ్చటైన కాంబినేషన్లు కలిసి ఒకే సినిమా చేస్తే అభిమానులకు పండుగనే చెప్పాలి. ఈ ముగ్గురి కలయికలో పవన్, త్రివిక్రమ్‌లు నిర్మాతలుగా నితిన్ హీరోగా ఒక సినిమాను ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. గత ఏడాది ఆఖరులో ఈ సినిమా అనౌన్స్ అయింది. స్క్రిప్ట్‌కు సంబంధించి అన్ని పనులను పూర్తిచేసుకున్న ఈ ప్రాజెక్ట్ ఈ జూన్ నెల 26న సెట్స్‌పైకి వెళ్లనుంది. ప్రస్తుతం హను రాఘవాపుడితో ‘లై’చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్న నితిన్ అది పూర్తవగానే ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్ అవుతాడు. ‘రౌడీ ఫెలో’తో దర్శకుడిగా మారిన లిరిసిస్ట్ కృష్ణ చైతన్య ఈ సినిమాను డైరెక్ట్ చేయనుండగా థమన్ సంగీతం అందించనున్నారు.