మెగాఫోన్ పడుతుందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దక్షిణాదిలో హీరోయిన్‌గా మంచి పాపులారిటీ తెచ్చుకుని, జాతీయ నటిగా గుర్తింపు సంపాదించుకున్న గ్లామర్ భామ ప్రియమణి ఈమధ్య బాగా వెనకబడింది. చేసిన సినిమాలన్నీ వరుస అపజయాలతో అవకాశాలు తగ్గాయి. దాంతో ప్రస్తుతం కన్నడంలో ఓ చిత్రంలో నటిస్తోంది. మరోవైపు బాలీవుడ్‌లో చెన్నయ్ ఎక్స్‌ప్రెస్ సినిమాలో చేసిన ఐటెమ్‌సాంగ్ హిట్‌అవ్వడంతో ఐటెం గర్ల్‌గా కూడా ముద్ర పడింది. ప్రస్తుతం చేతిలో చెప్పుకోదగ్గ సినిమాలు లేకపోవడంతో ఇప్పుడు ప్రియమణి రూట్ మారుస్తున్నట్టు తెలుస్తోంది. దర్శకత్వం చేయాలనే ఆసక్తి ఉందట ప్రియమణికి. ఇప్పుడు హీరోయిన్‌గా సినిమాలు చేతిలో లేవుకాబట్టి దర్శకురాలిగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. తమిళంలో ఆ దిశగా సన్నాహాలు కూడా మొదలుపెట్టిందట. ఏదేమైనా హీరోయిన్‌గా ఎక్కువ కాలం వెండి తెరపై నిలవలేకపోయిన ఈ భామ దర్శకురాలిగా ఎలాంటి గుర్తింపు తెచ్చుకుంటుందో చూడాలి!