మూడోసారి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్నాడు ప్రభాస్. ఈ సినిమాతో ఇండియన్ సూపర్‌స్టార్‌గా ఎదిగాడు. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘సాహో’ త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపింది. అత్యంత భారీ బడ్జెట్‌తో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కే ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరనే విషయంపై సందేహాలు నెలకొన్నాయి. ఇప్పటికే బాలీవుడ్ హీరోయిన్‌ను పెట్టాలని తెగ ప్రయత్నాలు చేసినా కూడా ఏదీ వర్కవుట్ కాలేదు. దాంతోపాటు దక్షిణాదిలో తమన్నా, కాజల్ పేర్లు కూడా వినిపించాయి. మరోవైపు బాలీవుడ్‌నుంచి దీపికా, పరిణితి చోప్రా, అలియాభట్‌ల పేర్లు వినిపించాయి. పలు కారణాలవల్ల ఈ హీరోయిన్లందరూ వెనకడుగు వేశారు. దాంతో తాజాగా ఈ లిస్టులోకి అనుష్క చేరిందని వార్తలొస్తున్నాయి. ఇప్పటికే ప్రభాస్‌తో రెండు చిత్రాల్లో నటించిన అనుష్క మరోసారి జోడీకడుతుందని టాక్. సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ఫైనల్‌గా అనుష్క నటించే అవకాశాలున్నట్లు ఫిలిం వర్గాలు భావిస్తున్నాయి. ఏదేమైనా యూనిట్ నుండి అధికారిక ప్రకటన వెలువడేవరకూ వెయిట్ చేయాల్సిందే.